ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జోరు నడుస్తుంది. ఆయన అందించిన బాణీలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో పాన్ ఇండియా సినిమాలు కూడా థమన్ వెనుక పడుతున్నాయి. అల వైకుంఠపురములో చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన థమన్ ప్రస్తుతం రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు సంగీత దర్శకత్వం వహించబోతున్నాడు.
కొద్ది రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ని ఎంపిక చేయడం వారి పేర్లు ప్రకటించడం చేస్తున్నారు.తాజాగా రామ్ చరణ్ -శంకర్ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కన్ఫాం చేశారు. థమన్ స్టూడియోలో శంకర్, చరణ్ సందడి చేయడంతో సినిమా పనులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.