Thalapathy Vijay | దశాబ్దాల పాటు వెండితెరపై అలరించిన ఓ గొప్ప స్టార్, తన మార్గాన్ని మార్చుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. తను నటించే చివరి సినిమాపై ఇన్నాళ్లూ ఆరాధించిన అభిమానుల్లో ఎంతటి హైప్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట త్వరలో అలాంటి సినిమానే రానుంది. వివరాల్లోకెళ్తే.. తమిళ అగ్రనటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట సొంత రాజకీయపార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘దళపతి 69’(వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నదని తెలియజేస్తూ, సదరు చిత్ర నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘కోట్లాది అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్న ‘దళపతి 69’ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇన్నాళ్లూ మనల్ని అలరించిన వ్యక్తికి ఇదే చివరి సినిమా కానుంది. ఈ కాంబో అత్యంత విధ్వంసకరంగా, ఇంతకు మించి అద్భుతం మరొకటి లేదు అనిపించేలా ఉండబోతున్నది’ అనేది ఈ ప్రెస్‌నోట్ సారాంశం.