Tenant Movie | గతేడాది ‘మా ఊరి పొలిమేర’ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్. ఈ సినిమా అనంతరం ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం టెనంట్ (Tenant) ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రానికి వై.యుగంధర్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19నన థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందించారు.
కథ విషయానికి వస్తే.. గౌతమ్ (సత్యం రాజేష్), రిషి (భరత్ కాంత్) ఇద్దరి పక్కపక్క టెనెంట్స్ జీవితంలో జరిగే కథ. గౌతమ్ తన మరదలు సంధ్య (మేఘ చౌదరి) ని కొత్తగా పెళ్లి చేసుకొని తన ఫ్లాట్ కి తీసుకు వస్తాడు. ఇక రిషి ప్రేమించిన అమ్మాయి శ్రావణి (చందన పయావుల).. ఇంటిలో వాళ్ళు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, హైదరాబాద్ రిషి ఫ్లాట్ కి పారిపోయి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా గౌతమ్ భార్య సంధ్య చనిపోతుంది. కొద్ది రోజులకు రిషి, శ్రావణి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అసలు సంధ్య ఎందుకు చనిపోయింది రిషి ఎలా ప్రమాదానికి గురయ్యాడు..? అసలు శ్రావణి ఏమైంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.