స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ముక్కోణపు ప్రేమకథాచిత్రం ‘తెలుసు కదా’. నీరజా కోనా దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ను అందించింది.
2గంటల 16 నిమిషాల నిడివి గల ఈ సినిమా.. ఎలాంటి లాగింగ్ లేకుండా, వినోదభరితంగా సాగిందంటూ సెన్సార్‌వారు అభినందించారని మేకర్స్ తెలిపారు. యువతరానికి కనెక్టయ్యే కథతో ఊహించని మలుపులు, భావోద్వేగాలతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.థమన్.