Telugu actor Rukshar Dhillon | టాలీవుడ్ యువ నటి రుక్సార్ ధిల్లాన్(Rukshar Dhillon) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ చిత్రం “రన్ ఆంటోని”తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగులో ‘ఆకతాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఇవ్వకపోగా.. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా, ఆమె నటనకు విమర్శకుల నుండి సానుకూల స్పందనలు లభించాయి. అనంతరం ‘ఏబీసీడీ’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఈ భామ. అయితే రుక్సార్ ధిల్లాన్ నటిస్తున్న తాజా చిత్రం దిల్ రూబా (Dil ruba). రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కథానాయకుడిగా నటిస్తుండగా.. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేడుకలో కొందరు జర్నలిస్ట్‌లు చేసిన పని రుక్సార్‌కి ఆగ్రహం తెప్పించింది.
”తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కొందరు జర్నలిస్ట్‌లు ఫోటోలు తీస్తూనే ఉన్నారని విమర్శించింది. నేను కంఫర్ట్‌గా లేనని చెప్పినా కూడా ఫోటోలు తీస్తారా? అంటూ జర్నలిస్ట్‌లను ప్రశ్నించింది. ప్రేమతో కూడా చెప్పాను ఫొటోలు తీయవద్దు నేను కంఫర్ట్‌గా లేనని అయిన కూడా వినట్లేదు. నేను పేర్లు చెప్పలేను కానీ ఇంకోసారి ఇలా చేయకండంటూ” రుక్సార్ చెప్పుకోచ్చింది.
సినిమా ఇండస్ట్రీ లో పెద్ద జర్నలిస్ట్ గుర్తింపు వస్తే చాలదు. ప్రవర్తించడం కూడా రావాలి ane Indirect Ga Cheparu! pic.twitter.com/pN4R0nHIEH
— Telugu Chitraalu (@TeluguChitraalu) March 6, 2025