Rahul Sipligunj | గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్ తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. హైదరాబాద్ బోనాల పండుగ సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేసింది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన అనంతరం ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా అతడు తెలంగాణ పాటలను ప్రోత్సహిస్తున్న సందర్భంగా ఈ నగదుని ప్రకటించింది ప్రభుత్వం.