శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడత్యా దర్శకుడు. జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. నవంబర్ 12న ఈ చిత్రం విడుదలకానుంది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘చరిత్రను సృష్టించిన ఓ ఉద్యమనాయకుడి పాత్రను పోషించడం గర్వంగా ఉంది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమం భావి తరాలకు నిఘంటువు లాంటిది. ఈ గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి జీవితంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని నిర్మాత పేర్కొన్నారు.