బంజారాహిల్స్, మే 8: తెలంగాణ సినిమా ఆర్ట్ డైరెక్టర్స్, అసిస్టెంట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
యూనియన్ అధ్యక్షుడిగా కె. మణి, ప్రధాన కార్యదర్శిగా కె. సుభాన్, కోశాధికారిగా ఎన్.శ్రీనివాసచారి, ఉపాధ్యక్షుడిగా ఎం.చెన్నయ్య, జాయింట్ సెక్రటరీగా ఎంఆర్ఎస్.రాజేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరిగా ఎ.అంజి ఎన్నికయ్యారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు అనుబంధంగా తమ యూనియన్ పనిచేస్తుందని వారు అన్నారు.