‘హను-మాన్’ఫేం తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధాగా కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2డి, 3డి ఫార్మాట్లలో, ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇందులో భాగంగా ఈ నెల 28న ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా, విలన్ మంచు మనోజ్.. ఇద్దరూ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు ఉన్న ట్రైలర్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సినిమాపై అంచనాలు పెంచేలా ఈ పోస్టర్ ఉన్నదని మేకర్స్ చెబుతున్నారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: గౌర హరి.