తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ఇటీవల అగ్ర నటుడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ చిత్రం ద్వారా ఓ అందమైన ప్రేమకథను ఆవిష్కరించబోతున్నాం. వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది’ అన్నారు. జయ ప్రకాష్, సుమన్, బొమ్మదేవర రామచంద్రరావు, శైలజా ప్రియ, నవీన్ నేని, విజయ్ మాస్టర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: వికాస్ బాడిస, పాటలు: శ్రీమణి, అనంతశ్రీరామ్, విరించి పుట్ల, మాటలు: బి.సుదర్శన్, నిర్మాత, రచన, దర్శకత్వం: బొమ్మదేవర రామచంద్రరావు.