Sadvi Rithambara | భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి.. సాధ్వి రితంబర సంచలన వ్యాఖ్యలు..!
Sadvi Rithambara | భారత్ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర అన్నారు. రాజకీయంగానూ భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూరీలో బుధవారం శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Sadvi Rithambara : భారత్ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర అన్నారు. రాజకీయంగానూ భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూరీలో బుధవారం శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పూరీలోని బాలియాపండాలోని సెవెన్ హిల్స్‌లో ఏడు రోజులపాటు భాగవత కథ నిర్వహించేందుకు సాధ్వి రితంభర వచ్చారు.
ఈ సందర్భంగా ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్‌పై జరుగుతున్న రాజకీయ చర్చపై ఆమె స్పందించారు. భారతదేశ మెజారిటీ ప్రజల ఆలోచనల్లో ‘వసుధైవ కుటుంబకం’ భావన ఉందన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే ఈ సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీలు ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పారు. సనాతన ధర్మంలోని ప్రాథమిక సిద్ధాంతాలను ప్రోత్సహించడం ద్వారా ‘వసుధైవ కుటుంబకం’ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చని సాధ్వి రితంభర అన్నారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు, సామూహిక చైతన్యంలో హిందూ దేశ భావన ఇప్పటికే ఉందని చెప్పారు.
భారత రాజ్యాంగంలో శ్రీరామచంద్రుడి ప్రస్తావన నుంచి ‘సత్యమేవ జయతే’ వరకు దేశ సాంస్కృతిక భావజాలం కనిపిస్తోందని ఆమె అన్నారు. హిందువుల సంక్షేమమే భారత సంక్షేమమని వ్యాఖ్యానించారు. భావాలు, ప్రవర్తన, జీవన విధానం పరంగా భారత్ హిందూ దేశంగానే ఉందని, రాజకీయంగా కూడా హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఆవుల సంరక్షణపైనా ఆమె మాట్లాడారు. గోవధ, మహిళలపై హింస, గర్భంలోని ఆడ శిశువుల హత్య జరిగే చోట శాంతి, సంతోషం ఉండవని అన్నారు.
ప్రభుత్వాలు ఇతర మార్గాల్లో ఆదాయం పొందవచ్చని, గోమాంసం విక్రయాల ద్వారా ఆదాయం పొందడం తీవ్రమైన పాపమని వ్యాఖ్యానించారు. శ్రీ జగన్నాథుడి దర్శనం తనకు ఎంతో భావోద్వేగ అనుభూతిని ఇచ్చిందని సాధ్వి రితంభర తెలిపారు. పూరీ సమన్వయానికి ప్రతీకగా నిలిచే పవిత్ర క్షేత్రమని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

