Toxic | కన్నడ, తెలుగు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి టాక్సిక్ (Toxic). A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. యశ్ 19వ చిత్రంగా వస్తోన్న టాక్సిక్‌కు పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్తను గ్లింప్స్ రూపంలో అందించారు మేకర్స్.
గీతు మోహన్ దాస్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ డైరెక్టర్‌గా ఆమెలోని యాక్షన్ అవతార్‌ను ప్రేక్షకులకు చూపిస్తూ బీటీఎస్ వీడియోను షేర్ చేశారు. యశ్ అండ్ టీంపై వచ్చే స్టైలిస్ యాక్షన్ ఎపిసోడ్‌ను ఎలా డిజైన్ చేసిందో బీటీఎస్వీడియో హింట్ ఇచ్చేస్తుంది. గీతు మోహన్ దాస్ సెట్స్‌లో యాక్షన్ సీన్లను వివరిస్తున్న తీరు టాక్సిక్‌లో యశ్లోని నయా స్టైలిష్ అవతార్‌ను చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా వీడియో చెబుతోంది.
ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ తెరకెక్కిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ భామలు హ్యూమా ఖురేషి, టారా సుటారియా కీ రోల్స్‌లో నటిస్తుండగా.. అక్షయ్ ఒబెరాయ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత యశ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Team Toxic Offers Powerful Glimpse of Geetu Mohandas in Action with Birthday BTS Video#Toxic#ToxicTheMovie #GeetuMohandas #Yash #KVNProductions@TheNameIsYash#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas pic.twitter.com/FQELHd5QPC
— BA Raju’s Team (@baraju_SuperHit) June 8, 2026
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు