Kanaka Durga Temple | టాలీవుడ్ యువ నటుడు నితిన్ విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా నేడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది చిత్రయూనిట్. నితిన్, దర్శకుడు వెంకీ కుడుములతో పాటు ఇతర ముఖ్య తారాగణం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శననంతరం నితిన్ మీడియాతో మాట్లాడుతూ రాబిన్‌హుడ్ సినిమా విజయవంతం కావాలని, అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ఈ దర్శనం చేసినట్లు నితిన్ తెలిపాడు. ఇక నితిన్ రాకతో విజయవాడలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు, నితిన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.
Team #Robinhood took divine blessings at Kanaka Durga Temple, Vijayawada ✨
The team will see you all today for a fun-filled evening.
6 PM onwards at PVP Mall ❤🔥#Robinhood GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash… pic.twitter.com/TsPaBgJplX— Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2025