Raakaasaa Movie | భక్తితో మొదలైన ‘రాకాస’ ప్రయాణం.. రాజమండ్రి దేవి చౌక్ అమ్మవారి సన్నిధిలో చిత్ర యూనిట్
Raakaasaa Movie | నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస' చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది.
Raakaasaa Movie | నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’ చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ క్రమంలో టీమ్ తమ ప్రమోషనల్ టూర్‌ను రాజమండ్రిలోని ప్రసిద్ధ దేవి చౌక్ వద్ద అమ్మవారిని దర్శించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించింది. ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి తదితర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ సొంతం చేసుకోగా, ఓవర్సీస్ మార్కెట్లో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 350కి పైగా స్క్రీన్లలో సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘స్నేక్ డాన్స్’ సాంగ్ మరియు టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఏప్రిల్ 2వ తేదీనే విదేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.
Team #Rākāsā began the city’s promotional tour on a blessed note by seeking the divine grace of Ammavaru at Devi Chowk. ✨
Get ready for a day full of madness and entertainment! 😎#Raakaasaa in theatres from April 3, 2026 🎬 pic.twitter.com/K84NrjdpFd
— BA Raju’s Team (@baraju_SuperHit) March 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

