Taylor Swift | హాలీవుడ్ పాప్ సింగర్, గ్లోబల్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift)పై డాక్యుమెంటరీ సిరీస్ రాబోతుంది. ‘ది ఎండ్ ఆఫ్ ఎరా’ (The End of an Era) అనే పేరుతో ఈ సిరీస్ రాబోతుండగా.. ఆరు ఎపిసోడ్లుగా విడుదల కాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ (Disney) లో డిసెంబర్ 13న టేలర్ స్విఫ్ట్ పుట్టిన రోజు కానుకగా ఒకరోజు ముందుగానే ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ డాక్యు సిరీస్‌కి సంబంధించి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో టేలర్ స్విఫ్ట్ తెర వెనుక ప్రయాణాన్ని ఆవిష్కరించడంతో పాటు తన కన్సర్ట్ టూర్ల కోసం పడిన కష్టం, రిహార్సల్స్, టేలర్ వ్యక్తిగత జీవితంలోని అరుదైన క్షణాలను చూపించనున్నారు.
టేలర్ తన తల్లి ఆండ్రియా స్విఫ్ట్ (Andrea Swift) తో మాట్లాడుతున్న ఎమోషనల్ మూమెంట్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్, NFL స్టార్ ట్రావిస్ కెల్స్ (Travis Kelce) గురించి కుటుంబంతో చర్చిస్తున్న సన్నిహిత దృశ్యాలు ఈ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా, సింగర్స్ సాబ్రినా కార్పెంటర్ (Sabrina Carpenter), ఎడ్ షీరన్ (Ed Sheeran) వంటి స్టార్ గెస్ట్‌ల సందడి కూడా బ్యాక్‌స్టేజ్ దృశ్యాలలో కనిపించారు.