టెక్నాలజీతో ఉరుకులు పెడుతున్న ఈ రోజుల్లో చేతబడి, బాణామతి ఉన్నాయంటే ఫక్కున నవ్వుతారు. కాని కొందరు మాత్రం ఆ పరిస్థితులని ఎదుర్కొని బయటపడ్డట్టు చెప్పుకొస్తుండడంతో ఏది నిజమో అర్ధం కాక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. తాజాగా విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలాది చిత్రాల్లో నటించిన టార్జన్ తన జీవితంలో ఎదురైన భయంకర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చారు.
టార్జాన్ అలియాస్ ఎదిరె లక్ష్మీనారాయణ గుప్తా.. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.శివ, క్షణ క్షణం వంటి చిత్రాల్లో నటుడిగా నిరూపించుకుని.. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.తాజాగా ఆయన యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.
13 ఏళ్లు పాటు చేతబడి వలన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం నమ్మం కాని దాని ఫలితాలు ఘోరంగా ఉంటాయి. మా ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు అందరికీ చేతబడి చేశారు.. అన్నయ్య అన్నం తింటే వాంతులు అయిపోయేవి. ఊరు పొలిమేర దాటితే ఏం ఉండేది కాదు.. కానీ బోర్డర్ దాటి ఊరులోకి వస్తే నీళ్లు తాగినా బయటకు వచ్చేసేవి. నాకు చేసారు .కడుపు నొప్పి వచ్చేది. వారెవరో మాకు తెలుసు. కేసులు కూడా పెట్టాం.
హైదరాబాద్ వచ్చాక అన్నీ సర్ధకున్నాయి. గత రెండు మూడేళ్లుగా పూర్తిగా దేవుడి స్మరణలోనే ఉన్నా.. ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్లి దైవ చింతనలో ఉంటున్నా’. చేతబడులు ఉన్నాయి.. మేం వాటిని నమ్ముతాం.. పౌర్ణమి, అమావాస్యలను నమ్మినప్పుడు వీటిని కూడా నమ్మాలి. మంత్రాలు తంత్రాలు అన్నీ ఉన్నాయి. ఈరోజుల్లో ఎవరూ నమ్మరు కానీ.. మేం అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. చాలామంది అంటుంటారు కానీ.. చేతబడి లాంటివి ఇప్పటికీ ఉన్నాయి అంటూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు టార్జాన్ .