బంగారు బతుకమ్మ చెబుతాను వినవమ్మ..
‘నాకు మణిరత్నంగారి ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే..’ పాటంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో కూడా అలాంటి పాట ఎప్పుడైనా చేయాలనుకునేవాడ్ని.
‘నాకు మణిరత్నంగారి ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే..’ పాటంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో కూడా అలాంటి పాట ఎప్పుడైనా చేయాలనుకునేవాడ్ని. ఫైనల్‌గా ఈ బడ్డీ కామెడీ సినిమాలో అలాంటి సిచ్యుయేషన్ కుదిరింది. ఇందులో ఒక ఫ్యామిలీ మీకు కొత్తగా కనిపిస్తుంది. ఈ కథతో ఈ ఫ్యామిలీకి గల సంబంధం తొలి 15 నిమిషాల్లోనే అర్థమవుతుంది. డ్యాన్స్ చేయడం అనేది నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చంద్రబోస్ సాహిత్యం, వివేక్‌సాగర్ సంగీతం, శ్రేయా ఘోషల్ గానం ఈ పాటకు హైలైట్స్.
పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈశ్వర్ కొరియోగ్రఫీ సూపర్. ఇందులో కీర్తన అనే పాత్రను శివాత్మిక పోషించారు. తన డ్యాన్స్ కూడా అద్భతంగా వచ్చింది. ఇదొక ఫెస్టివల్ సాంగ్’ అని తరుణ్ భాస్కర్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్ ‘ENE Repeat’. బ్లాక్‌బస్టర్ ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో క్రేజీ గ్యాంగ్ విశ్వక్సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు.
సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘బతుకమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో తరుణ్‌భాస్కర్ మాట్లాడారు. చిత్రబృందమంతా సినిమా విజయంపై నమ్మకం వెలిబుచ్చారు. ‘బతుకమ్మ బతుకమ్మ.. బంగారు బతుకమ్మ.. చెబుతాను వినవమ్మ.. చిన్నిముచ్చటా’ అంటూ సాగిన ఈపాట తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ, సెలబ్రేషన్ వైబ్‌తో సాగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

