నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలోని నర్సింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున ఇచ్చేలా 37 మందితో ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరంతా ఇప్పటికే రూ.20 వేల చొప్పున ఆమెకు అడ్వాన్స్ చెల్లించారని సమాచారం.
- చక్రం తిప్పుతున్న ఓ దవాఖాన చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్
- రూ.50 వేల చొప్పున ముడుపులు పుచ్చుకునేందుకు ఒప్పందం
- డీఎంఈ, డీహెచ్ కార్యాలయాల్లో జోరుగా పైరవీల పర్వం
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలోని నర్సింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున ఇచ్చేలా 37 మందితో ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరంతా ఇప్పటికే రూ.20 వేల చొప్పున ఆమెకు అడ్వాన్స్ చెల్లించారని సమాచారం.
విధులకు హాజరు కాకుండా జోరుగా పైరవీలు
యూనియన్ నేతగా ఉన్న సదరు మహిళా అధికారి తన విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, నిత్యం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయాల్లో తిరుగుతూ జోరుగా పైరవీలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ లెక్చరర్లకు ప్రమోషన్లు కట్టబెట్టాలని గతేడాదే స్కెచ్ వేసినట్టు తెలిసింది. అందులో భాగంగా సంబంధిత ఫైల్‌పై ప్యానల్ ఇయర్ చివరి రోజు సంతకం చేయించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటి ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషనర్ నిరాకరించినట్టు సమాచారం.
ప్రమోషన్ల ఫైల్‌ను వారం రోజుల ముందు తేవాలని, ప్యానల్ ఇయర్ చివరి రోజు తెచ్చి ఇస్తే ఎలాగని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫైలుపై సంతకం చేయకుండా తిప్పి పంపినట్టు వినికిడి. ఇటీవల ఆ అధికారి బదిలీపై వెళ్లినప్పటికీ ప్రమోషన్ల దస్త్రం మళ్లీ ముందుకు కదులుతున్నదని, డీఎంఈలోని ఓ కీలకాధికారితో ఆ మహిళా అధికారి కుమ్మక్కై, పనులు చక్కబెడుతానంటూ వసూళ్లకు తెర లేపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

