Akkineni Akhil Next Film Title | ‘సిసింద్రీ’ చిత్రంతో ఏడాది వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత ‘మనం’ సినిమాలో గెస్ట్ రోల్లో నటించాడు. తెరమీద కనిపించేది 2 నిమిషాలే అయినా తన ఛార్మింగ్‌తో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేశాడు. ఈ సినిమా తర్వాత వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తన డెబ్యూ సినిమా చేశాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం అంతగా సక్సెస్ కాకపోయినా అఖిల్ నటన, డ్యాన్స్‌లకు మంచి మార్కులే పడ్డాయి. ఈ తర్వాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. ఇలా హ్యట్రిక్ పరాజయాలు రావడంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో మొదటి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అగస్టు 12న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత అఖిల్, వకీల్‌సాబ్ ఫేం వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు గత రెండు మూడు రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగానే తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు ఎంత పెద్ద విజయం సాధించిందో అందిరికి తెలిసిందే. ఇప్పుడు ఆదే పేరుని అఖిల్ 5వ సినిమాకు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.