Tamil Nadu State Film Awards | తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్’ను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డులు 2016 నుండి 2022 మధ్య విడుదలైన తమిళ సినిమాలకే వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సినిమాలను గుర్తించి, ఉత్తమ దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులను సత్కరించే ఉద్దేశంతో ఈ అవార్డులు ఆహ్వానించబడతాయి. ఈసారి సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరంలోనే అత్యధిక అవార్డులను సాధించి సినీ పరిశ్రమలో విశేష చర్చకు దారి తీసింది. ఈ సినిమా మొత్తం ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుని ప్రేక్షకులకు, విమర్శకులకు సమానంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వంటి ప్రధాన విభాగాల్లో విజయం సాధించడం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 13న ఘనంగా నిర్వహించన్నట్టు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వేడుకలో అన్ని విభాగాల విజేతలను సన్మానించి, పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులందరికీ సత్కారం ఇవ్వనున్నారు.
ప్రధాన అవార్డుల వివరాలు:
సంవత్సరం వారీగా ముఖ్య అవార్డులు
2016
ఉత్తమ చిత్రం: మానగరం
ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి
ఉత్తమ నటి: కీర్తి సురేశ్
2017
ఉత్తమ చిత్రం: ఆరం
ఉత్తమ నటుడు: కార్తి
ఉత్తమ నటి: నయనతార
2018
ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్
ఉత్తమ నటుడు: ధనుష్
ఉత్తమ నటి: జ్యోతిక
2019
ఉత్తమ చిత్రం: అసురన్
ఉత్తమ నటుడు: ఆర్. పార్థిబన్
ఉత్తమ నటి: మంజు వారియర్
2020
ఉత్తమ చిత్రం: కూజంగల్
ఉత్తమ నటుడు: సూర్య
ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి
2021
ఉత్తమ చిత్రం: జై భీమ్
ఉత్తమ నటుడు: ఆర్య
ఉత్తమ నటి: లిజోమోల్ జోస్
2022
ఉత్తమ చిత్రం: గార్గి
ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు
ఉత్తమ నటి: సాయి పల్లవి
తమిళ సినిమా పరిశ్రమలోని ప్రతిభను గౌరవిస్తూ ప్రకటించిన ఈ స్టేట్ అవార్డులు, నటీనటులు, చిత్రబృందాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ‘జై భీమ్’ సినిమా సాధించిన ఘన విజయం ఈ అవార్డుల్లో హైలైట్గా నిలిచింది. ఈ అవార్డులు తమిళ సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం ప్రతిభను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘జై భీమ్’ వంటి సామాజిక సందేశం కలిగిన, అధిక విలువ కలిగిన సినిమాలకు వీటి ద్వారా మరింత గుర్తింపు లభించడం తమిళ చిత్రసీమలో సృజనాత్మకతకు ఊతం ఇస్తోంది.