గ్రామీ బరిలో తమిళ పాట
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల నామినేషన్లో తమిళ పాట ‘వరువాయ్' చోటు దక్కించుకుంది. 69వ గ్రామీ అవార్డుల్లో భాగంగా ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్' విభాగంలో ఈ పాట నామినేషన్ సాధించింది. 2027 గ్రామీ అవార్డుల రేసులో భారతదేశం నుంచి నామినేషన్ పొందిన ఏకైక పాట ఇదే కావడం విశేషం. ఈ పాటను సంగీత దర్శకుడు, గాయకుడు దేవన్ ఏకాంబరం స్వరపరచడంతో పాటు స్వయంగా ఆలపించారు.
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల నామినేషన్లో తమిళ పాట ‘వరువాయ్’ చోటు దక్కించుకుంది. 69వ గ్రామీ అవార్డుల్లో భాగంగా ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్’ విభాగంలో ఈ పాట నామినేషన్ సాధించింది. 2027 గ్రామీ అవార్డుల రేసులో భారతదేశం నుంచి నామినేషన్ పొందిన ఏకైక పాట ఇదే కావడం విశేషం. ఈ పాటను సంగీత దర్శకుడు, గాయకుడు దేవన్ ఏకాంబరం స్వరపరచడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఆయనతో పాటు గాయని సుభిక్ష రంగరాజన్ కూడా గాత్రాన్ని అందించారు. ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి రచించిన భక్తి కవిత ఆధారంగా ఈ పాటను రూపొందించారు. శ్రీకృష్ణుడి నేపథ్యంలో రూపొందిన ఈ పాటలో మనుషులు దైవ భావనలను అలవర్చుకొని చెడుని అంతం చేయాలనే ఆధ్యాత్మిక సందేశం కనిపిస్తుంది.
సంప్రదాయ భక్తి భావాలను, ఆధునిక సంగీత శైలితో కలబోసి ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం. సంగీత దర్శకుడు దేవన్ ఏకాంబరం 27 ఏళ్లుగా సినీరంగంలో కొనసాగుతున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ‘కాదలర్ దినమ్’ (ప్రేమికుల రోజు) చిత్రంలోని ‘ఓ మారియా’ పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. ఇప్పటివరకు దక్షిణాది భాషల్లో 500లకుపైగా పాటల్ని ఆలపించారు. ఇదిలావుండగా ‘ధురంధర్: ది రివేంజ్’ చిత్రానికిగాను శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం గ్రామీ నామినేషన్ సాధించలేకపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

