గత ఏడాది తమిళంలో విడుదలైన ‘డా..డా’ చిత్రం మంచి విజయం సాధించింది. కవిన్, అపర్ణదాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నీరజ కోన తెలుగులో ‘పా..పా’ పేరుతో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందించిన ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని, ఫీల్‌గుడ్ ఎమోషన్‌గా డ్రామా మెప్పించిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యే కథ ఇదని నిర్మాత నీరజ కోన తెలిపారు. భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్‌శక్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జెన్ మార్టిన్, దర్శకత్వం: గణేష్ కె బాబు.