కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ పేరుకు అత్యంత శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అని అర్థం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశా పటానీ నాయికగా నటిస్తున్నది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శివ దర్శకుడు.
త్రీడీ ఫార్మేట్లో రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో తెరపైకి రానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటన సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ…‘ఇవాళ మా చిత్రానికి టైటిల్ ప్రకటించడం సంతోషంగా ఉంది. సూర్య ఈ చిత్రంలో గంభీరమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం గోవా, చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో మిగతా భాగం తెరకెక్కిస్తాం. కథానుసారం గ్రాఫిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్.