Prashanth | రెండో పెళ్ళికి సిద్ధమైన సీనియర్ స్టార్ హీరో?
తమిళ హీరో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. జీన్స్, జోడి, దొంగ దొంగ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో తమిళంలో ఈయన నటించిన సినిమాలన్ని హిట్లే. తమిళంలో కొన్ని సంవత్సరాల పాటు ఈయన స్టార్ హీరోగా కొనసాగాడు.
Prashanth | తమిళ హీరో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. జీన్స్, జోడి, దొంగ దొంగ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో తమిళంలో ఈయన నటించిన సినిమాలన్ని హిట్లే. తమిళంలో కొన్ని సంవత్సరాల పాటు ఈయన స్టార్ హీరోగా కొనసాగాడు. తరువాత ఒక్కసారిగా నాలుగైదు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈయన స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అప్పుడే విజయ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం, విజయ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించడం ప్రశాంత్ కెరీర్‌కు తీవ్రంగా దెబ్బకొట్టాయి. ఇక చాలాకాలం తర్వాత తిరిగి ‘వినయ విధేయ రామ’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ రెండో పెళ్ళికి సిద్దమైనట్లు కోలీవుడ్ వర్గాల్లో సమాచారం.
ప్రశాంత్ 2005లో గృహలక్మీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వీళ్ళిద్దరూ వాళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికారు. అప్పటినుంచి ప్రశాంత్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇక తాజాగా ప్రశాంత్ రెండో పెళ్ళికి సిద్దమైయ్యాడని సమాచరం. ఈయన కుటుంబానికి పరిచయమున్న అమ్మాయిని ప్రశాంత్ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పెళ్ళిపై అధికారిక ప్రకటన రావచ్చు. ప్రస్తుతం ఈయన ‘అంధగన్’ సినిమాలో నటిస్తున్నాడు. క్రైమ్ కామెడి చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
Radhe Shyam | ‘రాధేశ్యామ్’ మరో రికార్డు.. రూ.400కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ?
Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Ram Charan-Shankar | మరోసారి రామ్‌చరణ్‌కు విలన్‌గా.. ఆ సీనియర్ స్టార్ హీరో?
Keerthi Suresh | రివేంజ్ కథతో కీర్తీసురేష్.. ఈ సారైనా హిట్టుకొడుతుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actorprashanth
- kollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

