మిల్కీ బ్యూటీ తమన్నాకు సోషల్‌మీడియాలో ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారంటే చెప్పడం కష్టమే. సినిమా సినిమాకు వన్నె తరగని అందంతో కొత్తగా కనిపిస్తూ సినీ ప్రియులను ఎంటర్ టైన్ చేస్తుంది. తమన్నా ప్రస్తుతం పింక్ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లాంగ్ డిజైనర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని పింక్ డ్రెస్‌లో కెమెరాకు పోజులిచ్చింది. గులాబీలా గుబాలిస్తున్నట్టుగా ఉన్న తమన్నా స్టిల్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. ప్రస్తుతం తమన్నా, గోపీచంద్ తో కలిసి సీటీమార్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబోలో వస్తున్న ఎఫ్ 3లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. సీటీమార్ ఏప్రిల్ 2న విడుదల కానుండగా..ఎఫ్ 3 ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.