అందం, అభినయం రెండు కలగలసిన నటి తమన్నా. బాహుబలి చిత్రంతో తన ఇమేజ్ను మరింత పెంచుకున్న తమన్నా ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోస్ చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. హిందీలోను సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. రీసెంట్గా తమన్నాకి ఓ హిందీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందని, త్వరలోనే ఆ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొననున్నట్టు సమాచారం.
మరోవైపు తమన్నా అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్ తో అభిమానులకు సరికొత్త కిక్కిస్తోంది. అల్లుడు శీను టైమ్ లోనే అమ్మడు కోటి వరకు డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ తరువాత జై లవ కుశ ,సరిలేరు నీకెవ్వరు వంటి సాంగ్స్ తో కూడా మంచి క్రేజ్ అందుకోంది. ఇక వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడు అందాల ఆరబోతతో అభిమానుల మనసులు కూడా గెలుచుకుంటూ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర తమన్నా హాట్ షో చూసి అభిమానులు నోరెళ్లపెడుతున్నారు. మిల్కీ బ్యూటీ పాలరాతి శిల్పంలా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.