Tamannaah Bhatia | హాట్ లుక్‌లోనైనా, చీరకట్టులోనైనా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia). నువ్ కావాలయ్యా అంటూ స్టైలిష్ హాట్ డ్యాన్స్‌తో కొన్ని రోజులుగా నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది తమన్నా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్నా ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు కంటి మీద కునుకు కష్టమే. హాట్ ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచే ఈ భామ తాజాగా ఎవరూ ఊహించని విధంగా సంప్రదాయ చీరకట్టులో మెరిసింది.
తమన్నా కొల్లాంలోని ఓ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీరకట్టు (Tamannaah Saree)లో హాజరైంది. మేలిమి బంగారంలా ధగ ధగ మెరిసిపోతూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ భామ ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్‌లో కీ రోల్ చేస్తోంది. ఇప్పటికే వివిధ భాషల్లో విడుదలైన కావాలా సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తూ.. మిలియన్ సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
తమన్నా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న భోళా శంకర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జైలర్ ఆగస్టు 10న విడుదల కానుండగా.. భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ కానుంది.తమన్నా ప్రస్తుతం జాన్ అబ్రహాంతో కలిసి నటిస్తోన్న వేద సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.

Tamannah Bhatia

Tamannah Bhatia1

Tamannah Bhatia2

Tamannah Bhatia3
ఈవెంట్లో తమన్నా..