Tamannaah Bhatia BA for Mysore Sandal Soap | ఇటీవల ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ నటి తమన్నా భాటియా మరో బంఫర్ ఆఫర్‌ను దక్కించుకుంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తయారు చేస్తున్న ప్రఖ్యాత మైసూరు శాండల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా నియమితులయ్యింది. ఈ ఒప్పందం రెండేళ్ల కాలానికి కుదరగా, ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం చెల్లించనున్నట్లు సమాచారం.
ఈ నియామకంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తమ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమన్నాకున్న విశేష ప్రజాదరణ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆమెకున్న ఫాలోయింగ్ తమ బ్రాండ్‌కు విస్తృత ప్రచారం కల్పిస్తుందని KSDL ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం తమన్నా పలు తెలుగు, హిందీ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఈ కొత్త బ్రాండ్ అంబాసిడర్ డీల్‌తో ఆమె కెరీర్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇకపై మైసూరు శాండల్ ఉత్పత్తుల ప్రచార చిత్రాలు, ప్రకటనల్లో సందడి చేయనున్నారు.