ఈ ఏడాది మార్చిలో చిరకాల స్నేహితుడు మాథిస్బోను పెళ్లాడింది పంజాబీ భామ తాప్సీ. కొద్దిమంది కుటుంబ సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వారి వివాహం జరిగింది. తన పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి విశేషాలను పంచుకోలేదు తాప్సీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహంతో పాటు తన భర్త మాథిస్బో గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కాలేజీ రోజుల నుంచి తాను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్ చేశానని, అయితే మాథిస్బోలో తాను పర్ఫెక్ట్మ్యాన్ను చూశానని తాప్సీ పేర్కొంది. ‘మాది ఒక్కరోజులో చిగురించిన ప్రేమకాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. మాథిస్‌తో చేసిన ప్రయాణంలో నేను చాలా సెక్యూర్డ్‌గా ఫీలయ్యాను. అతను బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ ధృక్పథంతో కనిపించేవాడు. సవాళ్లను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే మనస్తత్వం అతనిది. ఈ లక్షణాలు నచ్చే అతన్ని పెళ్లాడాను’ అని తాప్సీ చెప్పుకొచ్చింది. భిన్న దేశాలకు చెందిన ఇద్దరి మధ్య సాంస్కృతికంగా భేదాలు ఉన్నప్పటికీ..మాథిస్కు భారతీయ సంప్రదాయాలపై మంచి అవగాహన ఉందని తాప్సీ పేర్కొంది.