బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్లో నడుస్తున్న బాయ్‌కాట్ ట్రెండ్‌పై నటి స్వర భాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకరి పరాజయాన్ని వేడుకలా జరుపుకోవడం పట్ల తనకు విశ్వాసం లేదని పేర్కొన్నారు.
ముంబై : బాలీవుడ్లో నడుస్తున్న బాయ్‌కాట్ ట్రెండ్‌పై నటి స్వర భాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకరి పరాజయాన్ని వేడుకలా జరుపుకోవడం పట్ల తనకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. సుశాంత్ రాజ్పుట్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్లో దిగజారుడు ధోరణి, విద్వేష భావం వ్యాప్తి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలీవుడ్ అంటే ఆల్కహాల్, సెక్స్, డ్రగ్స్ అన్నట్టుగా చిత్రీకరించారని ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ఇక పరిశ్రమలో పెరుగుతున్న ఉత్తరాది వర్సెస్ దక్షిణాది డిబేట్పైనా స్వర భాస్కర్ స్పందించారు. సినీ పరిశ్రమను ఈ తరహాలో విభజించే తీరు తనకు నచ్చదని స్పష్టం చేశారు. పరిశ్రమలో నటులంతా ఒకటేనని, బాక్సాఫీస్ వద్ద సినిమాలు ఆడితే అది అందరికీ మంచిదేనని అన్నారు. పరిశ్రమను ప్రాంతాలు, భాషల వారీగా విభజించడం చౌకబారుతనమని మండిపడ్డారు. ఒకరి విజయం చూసి అసూయచెందడం, ఒకరి వైఫల్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరైంది కాదని అన్నారు.
కొవిడ్-19 పరిస్ధితుల నుంచి మనం బయటకు వస్తున్నామనేది అందరూ గుర్తెరగాలని అన్నారు. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులకు కొవిడ్-19 పీడకల వంటిదని చెప్పుకొచ్చారు. నటులు కొందరు మనకు నచ్చినా నచ్చకపోయినా సినీ పరిశ్రమ పలువురికి ఉపాధి కల్పిస్తోందని అందుకే ఇతరులకు వైఫల్యాలు ఎదురైనప్పుడు సంతోషించాల్సిన అవసరం లేదని తాను భావిస్తానని అన్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 గురించే అందరూ మాట్లాడుతున్నారని దక్షిణాది సినిమాలు అన్నీ ఆడటం లేదనేది గుర్తెరగాలన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

