Swara Bhasker | బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పండండి బిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని స్వరా భాస్కర్ ఫహద్ అహ్మద్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి స్వరా దంపతులు కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నది. ఈ నెల 23న కూతురు జన్మించిందని, పేరు రబియాగా నామకరణం చేసినట్లు పేర్కొంది. సర్వా భాస్కర్ అహ్మద్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 6, 2023న సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ను స్వరా పెళ్లి చేసుకున్నది.
తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకుని.. ఆ తర్వాత మార్చిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. మార్చిలో తాను తల్లిని కాబోతున్నానంటూ బేబీ బంప్ ఫొటోలను సైతం షేర్ చేశారు. ‘కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇదొక గొప్ప అనుభూతి. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం’ అంటూ అక్టోబర్ బేబీ పేరిట హ్యాష్‌ట్యాగ్ ఇస్తూ అక్టోబర్‌లో బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ జంటకు సెప్టెంబర్ 223న కూతురు జన్మించగా.. 25 అభిమానులతో ఫొటోలను పంచుకుతున్నారు. ప్రస్తుతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.