Seethamma Vakitlo Sirimalle Chettu | టాలీవుడ్ స్టార్ నటులు విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), ప్రధాన పాత్రల్లో వచ్చి 2013లో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మించాడు. ప్రకాశ్ రాజ్ జయసుధ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా వచ్చి 12 ఏండ్లు అవుతున్న సందర్భంగా నేడు రీ రిలీజ్(Seethamma Vakitlo Sirimalle Chettu Re Release) చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాను చూడటానికి అటు మహేశ్, వెంకీ అభిమానులతో పాటు సినిమా లవర్స్ థియేటర్లకి క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాకి వచ్చే అభిమానులు పూల కుండీలను వెంట తెచ్చుకుంటుడంతో థియేటర్ యాజమాన్యం హాల్లోకి పూల కుండీలను అనుమతి ఇవ్వట్లేదని సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించిన వెంకటేశ్, మహేశ్ సినిమా ఇంటర్వెల్ టైంలో గొడవ పడిన అనంతరం మహేశ్ నడుచుకుంటూ వెళుతూ పక్కనున్న పూల కుండీని తన్నుతాడు. దీంతో పెద్దోడు అయిన వెంకీ చిన్నోడు(మహేశ్)ని అడుగుతూ.. పూల కుండీని ఎందుకురా అలా తన్నావు అంటాడు. అయితే ఈ సీన్ తర్వాత చాలా ఫేమస్ అయ్యింది. మీమర్స్ కూడా ఈ సన్నివేశాన్ని చాలా సందర్భంలో వాడేశారు. అయితే ఈ సీన్‌ని అభిమానులు థియేటర్లో రీ క్రియేట్ చేసి హాల్ని నాశనం చేసే అవకాశం ఉండడంతో ఈ సినిమా రీ రిలీజ్ చేసిన థియేటర్ యాజమానులు అలెర్ట్ అయ్యి పూల కుండీలను బ్యాన్ చేసినట్లు సమాచారం. మరోవైపు కొన్ని థియేటర్లలో అభిమానులు సిబ్బందికి తెలియకుండా పూల కుండీలను హాల్లోకి తీసుకువచ్చి మహేశ్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Poola kundi tho Goal kottarentra… 😂🤣😅
” Poola kundi scenes recreated ” #SVSCReRelease pic.twitter.com/wvuWUfcg84
— Vicky Roxx (@VickyyRoxx) March 7, 2025
Poolakundi oka emotion 😂🤩#SVSCReRelease pic.twitter.com/DvMemKmziQ
— ʌınɐʎ (@CoolestVinaay) March 7, 2025
Theatre Lopala bindhela scene, poolakundi scene, bike scene re-create chedham anukunte theatre owner lolaliki allow cheynu antunnadu😭🤧
Atleast climax short circuit scene ayina recreate cheyyali 🤞 pic.twitter.com/698QfPkAWQ
— SK (@intiki_chinnodu) March 6, 2025