బాలీవుడ్ (Bollywood)సెలబ్రిటీలు ప్రేమలో పడటం, బ్రేకప్ చెప్పుకోవడం సర్వసాధారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే లవ్ జర్నీ మొదలు, బ్రేకప్ వరకు సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారిపోతుంటారు. ఇదే లిస్టులో చేరిపోయింది అలనాటి అందాల తార, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ (Sushmita Sen). ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ తన భాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్ (Rohman Shawl)తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బీటౌన్ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ వార్తలతో సుస్మితాసేన్ ఫాలోవర్లు, అభిమానులు నిరాశలో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియమైన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చింది. రోహ్మాన్తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ..‘మేం స్నేహితులుగా ప్రయాణం మొదలుపెట్టాం. మేం మళ్లీ స్నేహితులుగా మారిపోయాం’ అంటూ ఊహాగానాలకు చెక్ పెట్టింది. రిలేషన్ షిప్ చాలా కాలం నాటిది. ప్రేమ మిగిలి ఉంది…’ఊహాగానాలు లేవు..‘మంచి జ్ఞాపకాలు’, ‘జీవించు, జీవనం సాగించు’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇటీవలే సుస్మితాసేన్, రోహ్మాన్ ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. రోహ్మాన్ బుధవారం సుస్మితాసేన్ ఇంటి నుంచి బయటకు వస్తున్న స్టిల్ నెట్టింట్లో హల్ చల్ చేయడంతో..సుస్మితాసేన్ ఫైనల్‌గా బ్రేకప్ చెప్పేసిందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు.