Suriya Jyothika | కోలీవుడ్ స్టార్ జంట ముందుగా గుర్తొచ్చేది సూర్య, జ్యోతికలు. పూవెల్లం కెట్టుప్పర్ (Poovellam Kettuppar) అనే సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అయితే సినిమా షూటింగ్ సమయంలోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక పెద్దలను ఒప్పించి 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు సూర్య, జ్యోతిక. అయితే రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఎంతో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తుంది. ఇక ఇటీవల వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలపై జ్యోతిక స్పందిస్తూ.. నాకు సూర్యకు మధ్య ఎలాంటి గొడవులు లేవు అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ జంట జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. సూర్య, జ్యోతికలు జిమ్‌లో వర్క్ ఔట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం కంగువ సినిమా చేస్తుండగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అనంతరం సుధా కొంగర దర్శకత్వంలో సూర్య43 చేస్తుండగా.. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య44 ఓకే చేశాడు. ఇక జ్యోతిక విషయానికి వస్తే.. ప్రస్తుతం డబ్బా కార్టెల్() అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.
#Suriya and #Jyotika are giving us major couple fitness goals ❤️🔥💪#Kanguva #Suriya44 #Suriya
— Suresh PRO (@SureshPRO_) April 2, 2024