Suriya | కమల్, రజనీ తర్వాత టాలీవుడ్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సూర్య అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఆయన సినిమాలను ఇక్కడి ప్రేక్షకుల ఏ రేంజ్లో ఆదరిస్తారో ఇటీవలే రీ-రిలీజైన సూర్య సన్నాఫ్ కృష్ణన్ యుఫోరియా చూస్తే క్లారిటీ వస్తుంది. ఒక తెలుగు స్టార్ హీరో సినిమా రీ-రిలీజైతే ఏ స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతాయో.. మొన్న రిలీజైన ఈ సినిమాకు కూడా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి సూర్య సైతం ఆశ్చర్యపోయాడంటే మనోళ్లు ఆయన్ను ఎంతగా అభిమానిస్తున్నారో పర్టిక్యులర్‌గా చెప్పే అవసరం లేదు. అంతేకాకుండా మనోళ్లు సూర్యను దత్త పుత్రుడు అంటూ ప్రేమగా పిలుచుకుంటుంటారు.
ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే సుధా కొంగరతో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో సూర్య కాలేజీ కుర్రాడిలా కొంత సేపు కనిపించనున్నాడట. అంతేకాకుండా సినిమాను నడిపించేది ఆ పాత్రే అని చెన్నై టాక్. మాములుగానే కాలేజీ కుర్రాడి పాత్ర అంటే సూర్య చింపేస్తాడు. ఇక ఇప్పుడు సినిమాలో కీ రోల్ అదే అంటే ఓ రేంజ్లో నటిస్తాడో ఊహకు కూడా అందదు.
ఆకాశం నీ హద్దురా వంటి అల్టిమేట్ సినిమా తర్వాత ఈ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అందరిలో అమితాసక్తి నెలకొంది. ఈ సినిమాను సూర్య తన స్వంత బ్యానర్‌పై నిర్మించనున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ కూడా నటించబోతున్నాడని సమాచారం. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరికల్లా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.