Surya | తమిళ హీరో సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సూర్య44’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నది. సూర్య పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. సూర్య ఫ్రెంచ్ గడ్డంతో, ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇది మాస్ యాక్షన్ ఎంటైర్టెనర్ అని ఈ గ్లింప్స్ చెబుతున్నది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నవి.
త్వరలో ప్రమోషన్స్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. సూర్య, జ్యోతిక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటైర్టెనర్‌లో పూజా హెగ్డే కథానాయిక. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ కృష్ణ, సంగీతం: సంతోష్ నారాయణన్, సహనిర్మాతలు: రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్, కార్తికేయ సంతానం, నిర్మాణం: 2డి ఎంటైర్టెన్మెంట్స్.