Retro | ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరో (Suriya) సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. మూస ధోరణిలో కాకుండా ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య.. రెట్రో (Retro) సినిమాతో అభిమానులను పలకరించాడు. చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఈ సినిమాతో మళ్లీ వెండి తెరపై కనిపించింది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీని మే 1న తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. అయితే ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సూర్య, పూజల యాక్టింగ్ బాగున్నా.. కథ, కథనాలు నిరాశ పర్చాయి. అయితే తమిళ్ తో మాత్రం రెట్రో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ.70 కోట్లలోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే థియేటర్లలో అంతంతమాత్రమే నడిచిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నది. రెట్రో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఈ నెల 31న స్రీమింగ్ చేయనుంది.
1990ల బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన రెట్రోను.. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‌లో కనిపించిన ఈ సినిమాలో జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణణ్ సంగీతం అందించారు.