RETRO Telugu Kanima | తమిళ నటుడు సూర్య (Suriya) దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju), కాంబోలో వస్తున్న తాజా చిత్రం రెట్రో(Retro Movie). యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటిస్తుంది. మలయాళ నటుడు జోజు జార్జ్, కరుణకరణ్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్.
రెట్రో నుంచి ‘కన్నమ్మ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) స్వరపరిచిన ఈ గీతంలో అదిరిపోయే స్టెప్పులతో సూర్య- పూజల జంట ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్ మారిన ప్రేమికుడిని అతడి ప్రేయాసి ఎలా బయటికి తీసుకువచ్చింది. తన ప్రేయాసి కోసం కథానాయకుడు ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ. సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన భార్య జ్యోతికతో కలిసి సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.