Suriya | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. సినిమాను ప్రమోట్ చేయడంలో పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు మేకర్స్.
సూర్య టీం ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసి.. సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించింది.
కంగువ గ్లింప్స్(Kanguva Glimpse) వీడియో జులై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేస్తూ.. మేకర్స్ ఇప్పటికే సూర్య యుద్ధవీరుడిలా ఖడ్గం చేతబట్టి.. కదనరంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఉన్న హాఫ్ లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా వారియర్ గుర్రంపై వస్తున్న బ్యాక్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. రాజసం ఉట్టిపడే తాజా లుక్‌తో సినిమాపై అభిమానుల్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తున్నాడు.
ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2024 ప్రథమార్థంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ ఉండబోతుందని సమాచారం. కంగువ సీక్వెల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్న విషయం తెలిసిందే.
కంగువ నయా లుక్..
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023