టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నేటి యువ నటీనటులకు స్పూర్తి ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చిరంజీవి (Chiranjeevi) . అప్ కమింగ్ హీరోలకే కాదు, కెరీర్లో నిలదొక్కుకుని స్టార్ హీరోలుగా మారిన వారికి కూడా చిరంజీవి చాలా విషయాల్లో స్పూర్తిగా నిలుస్తుంటారు. ఓ స్టార్ హీరో కేవలం చిరు యాక్టింగ్కే కాదు..ఆయన చేసే ఇతర కార్యక్రమాలను చూసి స్పూర్తి పొందాడట. ఈ విషయాన్ని ఆ స్టార్ హీరోనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ స్టార్ ఎవరనే కదా మీ డౌటు.
కోలీవడ్ స్టార్ హీరో సూర్య (Suriya). కొత్త చిత్రం ఈటీ (ET) ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య చెప్పిన మాటలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. చిరంజీవిగారు బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలని నాలో స్పూర్తి నింపిన వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. అప్పుడే నేను చెన్నైలో ఎన్జీవో అగరమ్ ఫౌండేషన్ను స్థాపించానని అన్నాడు. తెలుగు ప్రేక్షకులను తనను ఇతర భాషా నటుడని కాకుండా వారి సొంత హీరోగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశాడు.
హైదరాబాద్ తనకు ఎప్పుడూ ఇల్లు లాంటిది. తనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన నిర్మాత అల్లు ఎప్పటికీ రుణపడి ఉంటానని సూర్య అన్నాడు. కరోనా సంక్షోభం తర్వాత తొలిసారి థియేటర్లో విడుదల కానున్న చిత్రమిదే కావడం విశేషం. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఓటీటీలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్నాయి.