Retro Movie | తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తమిళంలో మాత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇటీవల ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రబృందం ప్రకటించింది.
అయితే ‘రెట్రో’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య.. ఈ సినిమా లాభాల నుంచి రూ. 10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తన అగరం ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల విద్య కోసం అందజేయనున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ రెట్రో సినిమా విజయం సాధించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆకాంక్షతోనే తాను అగరం ఫౌండేషన్ స్థాపించానని, నేను ఇవ్వబోతున్న ఈ విరాళం మరింత మంది విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య ఒక ఆయుధంతో పాటు ఒక రక్ష వంటిదని ఆయన పేర్కొన్నారు.
సూర్య 2006లో అగరం ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ తమిళనాడులోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
Nice gesture by @Suriya_offl to donate ₹10 crores from #Retro profits to #Agaram Foundation which has been in the forefront of supporting deserving students from underprivileged backgrounds in rural areas in their educational endeavours 👏👏 pic.twitter.com/4A4oBCMp1d
— Sreedhar Pillai (@sri50) May 7, 2025