Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మంచి డెడికేషన్ ఉన్న నటుడు. సినిమా హిట్టా, ఫ్లాపా అనేది ఆలోచించకుండా ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేస్తుంటాడు.ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన సూర్య ఈ మధ్య సక్సెస్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం కంగువ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇక మొన్న సూర్య నటించిన రెట్రో సినిమాకు సైతం మిశ్రమ స్పందన రావడంతో సూర్య డల్ అయిపోయాడు. తెలుగులో హిట్ 3 ది థర్డ్ కేస్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. నాని వయొలెంట్ మాస్ ముందు రెట్రో పూర్తిగా తేలిపోయింది.
కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘రెట్రో’. తమిళ్ లో మాత్రం బాగానే రాణించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా మే 29 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. సూర్య ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సూర్య ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు.
తన భార్య జ్యోతికతో కలిసి సూర్య సందడి చేశారు. సూర్య-జ్యోతిక ఇలా ఒకే ఫ్రేములో కనిపించడంతో రూమర్స్‌కి చెక్ పడ్డాడు. ఆ మధ్య జ్యోతిక-సూర్యల మధ్య విబేధాలు వచ్చాయని, జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే టాక్ నడిచింది. దీంతో పుకార్లకి పులిస్టాప్ పడినట్టు అయింది. ఇటీవలే దియా ఇంటర్ పూర్తి చేసింది. పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుక గ్రాండ్ గా జరగ్గా జ్యోతిక, సూర్య దంపతులు పాల్గొన్నారు. తన కూతురితో కలిసి గర్వంగా నిలబడి ఫోజులు ఇచ్చిన ఫోటో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. దియా 12వ తరగతిలో 600కి 581 మార్కులు సాధించిందని టాక్.