Suriya 42 | క్రేజీ టాక్..పది భాషల్లో ‘సూర్య 42’ సినిమా..!
సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా..ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సూర్య అభిమానుల్లో జోష్ నింపుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా..ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సూర్య అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఈ మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ సినిమా పది భాషల్లో విడుదల కానుందట. సూర్య 42 చిత్రాన్ని 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న వార్తతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారా..? అనేది చూడాలి. ఇప్పటికే మోషన్ పోస్టర్లో సూర్య లుక్‌ను చూపించకుండా..సినిమా 3డీ ఫార్మాట్లో ఉండబోతుందని చెప్పారు మేకర్స్.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీరియాడిక్ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని మోషన్ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. రీసెంట్గా కమల్ హాసన్ లీడ్ రోల్ పోషించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టాడు సూర్య. దీంతోపాటు మాధవన్ టైటిల్ రోల్లో నటించిన రాకెట్రీ..ది నంబియార్ ఎఫెక్ట్‌లో అతిథి పాత్రలో మెరిశాడు.
Read Also : Rohit and Marina | రోహిత్-మెరీనా కపుల్‌కు బిగ్‌బాస్ బిగ్ షాక్..!
Read Also : Bigg Boss 6 Nominations | నామినేషన్స్ లో ఎలిమినేట్ అయ్యేదెవరు..? ప్రోమో
Read Also : Amala Paul Onam Look | ఈ ‘సీతాకోక చిలుక ఒళ్లెంతో అతిశయం’..ఓనం చీరలో అమలాపాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

