‘బిలీవ్’తో భాగస్వామ్యం

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ‘ఎస్.పీ’ మ్యూజిక్ లేబుల్‌తో సంగీతరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘నారప్ప’ చిత్ర ఆల్బమ్‌ను విడుదల చేశారు. తాజాగా పారిస్‌కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్.పీ మ్యూజిక్ జత కట్టింది. వీరిద్దరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ సినిమా సంగీతాన్ని ప్రపంచ వేదికపై ప్రమోట్ చేయనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన ‘బిలీవ్’తో భాగస్వామ్యం తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సురేష్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “బిలీవ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువకావాలని ఆశిస్తున్నాం. ఈ భాగస్వామ్యంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. దక్షిణాది దిగ్గజ నిర్మాణ సంస్థతో తాము భాగస్వామ్యం కావడం సరికొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తుందని బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

