Akhil Agent Movie | అక్కినేని నట వారసుడు అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం రీ షూట్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అడుగడుగున సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవలే అఖిల్ గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడగా, తాజాగా ఈ చిత్రం రీ షూట్‌కు సిద్ధమౌవుతున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది నవంబర్‌లో యూరప్‌లో ఈ చిత్రం మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అవుట్‌పుట్ సరిగ్గా రాలేదని మరోసారి యూనిట్ యూరప్‌కు వెళ్ళనుందని సమాచారం. అంతేకాకుండా నిర్మాణ భాగస్వామిగా సురేందర్ రెడ్డి తప్పుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఏజెంట్ షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది.