Surekha Vani| టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది సురేఖా వాణి. కొత్త హీరోయిన్స్ కన్నా ఎక్కువ పాపులారిటీనే అందిపుచ్చుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన సురేఖా వాణి ఇప్పుడు రూట్ మార్చింది. తన కూతురు సుప్రితతో కలిసి ఘాటు అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అసలు ఈ తల్లి కూతుళ్లు ఇద్దరు ఇలా గ్లామర్ షో చేయడంలో పోటీ పడడమేంటని అందరు ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు సురేఖా వాణి తన కూతురు సుప్రితని హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది.
అయితే సురేఖా వాణితో పాటు సుప్రిత తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్న క్రమంలో వారు తప్పైంది, క్షమించమంటూ వీడియోలు విడుదల చేశారు.. మొన్న వైజాగ్ యూట్యూబర్ నాని, నిన్న మరో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అవి తమకి ఎక్కడ చుట్టుకుంటాయో అని భావించిన సురేఖా వాణి, సుప్రితలు విడివిడిగా వీడియోలు విడుదల చేశారు. తాను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని.. తప్పైపోయింది క్షమించండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇకపై అలా చేయనని తెలిపింది. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లను ఫాలో అవొద్దంటూ అందులో పేర్కొంది సుప్రిత.
ఇక సురేఖా వాణి కూడా ఓ వీడియో విడుదల చేస్తూ.. కొంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసారు. వాళ్లలో నేను ఒకదాన్ని. అయితే ఇప్పుడు వాటిని ఆపేశాను. దానికి మీ అందరికీ సారీ. మీరెవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వొద్దు. అలా చేసి ఈజీ మనీకి అలవాటు పడొద్దు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఏవైనా యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. అంతేకాకుండా ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలోకూడా అవ్వొద్దు అంటూ హోళి శుభాకాంక్షలు తెలియజేసింది సురేఖా వాణి. మొత్తానికి తల్లి కూతుళ్ల వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.