రజినీకాంత్ చేసిన పనికి డైలమాలో ఫ్యాన్స్.. నవ్వాలా ఏడవాలా..?
లైకా ప్రొడక్షన్ హౌస్ తో రజనీకాంత్ ఏకంగా రెండు సినిమాల డీల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో వీళ్ళు రోబో 2.0 సినిమాను నిర్మించడంతో పాటు.. మరికొన్ని రజనీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. జైలర్ సినిమా పూర్తి కాగానే ఆ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.
ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసిన రజనీకాంత్.. 2000 తర్వాత తన జోరు తగ్గించాడు. వయసుకు గౌరవం వచ్చి ఏడాదికి ఒక సినిమా లేదంటే.. అప్పుడప్పుడు రెండు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక గత పదేళ్ల నుంచి అయితే రజినీకాంత్ నుంచి రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా రావడం గగనంగా మారిపోయింది. పైగా ఒకప్పట్లా రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించడం లేదు. అందుకే ఆయన కూడా సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అన్నింటి కంటే ముఖ్యంగా ఇదివరకటి మాదిరి ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఒకప్పుడు ఎంత వేగంగా సినిమాలు చేసినా కూడా వయసు ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆయన వయసు 70 పైనే. ఇలాంటి సమయంలో కూడా వరుస సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా గతేడాది పెద్దన్న సినిమా సమయంలో రజినీకాంత్ అనారోగ్యం పాలవడం.. ఆ షూటింగ్ జరుగుతున్న స్థలం అంతా ఒక హాస్పిటల్ వాతావరణం తలపించడంతో ఇకనుంచి రజనీకాంత్ సినిమాలు చేయకపోవడమే మంచిది అంటూ అభిమానులు కూడా కోరుకున్నారు.
ఆయన ఆరోగ్యంగా ఉంటే అదే చాలు.. సినిమాలు చేసిన చేయకపోయినా పెద్దగా పట్టించుకోము అని సోషల్ మీడియాలో కామెంట్ కూడా చేశారు. కేవలం ఈ అనారోగ్యం కారణంగానే రజినీకాంత్ పూర్తిగా పాలిటిక్స్ నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నాడు రజనీకాంత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30% పూర్తయింది. దీని తర్వాత మళ్లీ భారీ బ్రేక్ తప్పదు అనుకుంటున్న సమయంలో లైకా ప్రొడక్షన్ హౌస్ తో ఏకంగా రెండు సినిమాల డీల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
గతంలో వీళ్ళు 2.0 సినిమాను నిర్మించడంతో పాటు.. మరికొన్ని రజనీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. జైలర్ సినిమా పూర్తి కాగానే ఆ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసి రజిని అభిమానులు షాక్ అవుతున్నారు. అసలే ఆరోగ్యం అంత మాత్రంగా ఉన్న సమయంలో ఇలా వరుస సినిమాలు చేయడం అవసరమా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
‘RC15’ షూటింగ్ పున:ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Cinema Badsha | రూ.300 కోట్ల క్లబ్లో దక్షిణాది సినిమాల రుబాబు.. ఆ 10 సినిమాల్లో 7 మనవే.. అవేంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

