Super star Krishna | కృష్ణ బంగారం.. ఎంతోమంది నిర్మాతలను నిలబెట్టారు : ఆర్ నారాయణ మూర్తి
కృష్ణ పార్థీవ దేహానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి (R Narayanamurthy) నివాళులర్పించారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో నేనెవరికంటే ఎక్కువ కాదు..నేనెవరికంటే తక్కువ కాదు..అని ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు కృష్ణ అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ (Super star Krishna) పార్థీవదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కృష్ణ పార్థీవ దేహానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి (R Narayanamurthy) నివాళులర్పించారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో నేనెవరికంటే ఎక్కువ కాదు..నేనెవరికంటే తక్కువ కాదు..అని ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు కృష్ణ అని అన్నారు.
మన సినీ పరిశ్రమలో ఎందోరో మహానుభావులకు వందనాలు చెప్పుకుంటాం. అందులో ముఖ్యంగా నాలాంటి వాళ్లను, చాలా మంది పేదవాళ్లను, బడుగుబలహీన వర్గాల ప్రజలను, కళాకారులవ్వాలని ఆశతో వచ్చిన వారికి అవకాశాలివ్వడమనేది గొప్ప ఆశయం. అలాంటి ఆశయాన్ని పునికి పుచ్చుకున్న మహనీయుల్లో నిర్మాతల్లో డి రామానాయుడు, దర్శకుల్లో దాసరి నారాయణరావు, రైటర్స్ లో పరుచూరి బద్రర్స్, హీరోల్లో కృష్ణగారు ఒకరని చెప్పారు.
ఎప్పుడు కృష్ణగారి ఆఫీస్ కళకళలాడుతూ ఉండేది. నిజంగా కృష్ణ బంగారం.. ఎంతో మంది నిర్మాతలను ఆయన నిలబెట్టారు. సక్సెస్ అయితే సంతోషం. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ నిర్మాతలను పిలిచి, వారికి డేట్స్ ఇచ్చి నిలబెట్టిన మహనీయుడు, గొప్ప మనసున్న మారాజు కృష్ణ. అల్లూరి సీతారామరాజు లాంటి మహాద్బుతమైన కావ్యాన్ని సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎన్నో సార్లు అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రాయించుకున్నారు. అదే టైంలో కృష్ణ సినిమా చేశారు.
నందమూరి తారకరామారావుకు ఆ సినిమా చూపిస్తే ఆయన కృష్ణతో..బ్రదర్ కృష్ణ ఇక మేం ఆ సినిమా తీయం. ఈ చిత్రాన్ని అద్బుతంగా తీశారు. గొప్పగా తీశారు..అని సాక్షాత్తు ఆయనను ఆశీర్వదించారు. దటీజ్ హీరో కృష్ణ అని అన్నారు పీపుల్స్ స్టార్ .
Read Also : Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

