సీన్ రీ క్రియేషన్ టాస్క్ ఏమో కాని సన్నీపై ఉన్న కోపం మొత్తాన్ని సిరిపై తీస్తూ కనిపించాడు షణ్ముఖ్. మధ్యలో ఆమె తల్లిని కూడా తీసుకొచ్చి మాట్లాడాడు. ఓ సందర్భంలో సిరి ఏమనలేక కన్నీరు కూడా పెట్టుకుంది. కొద్ది సేపటి తర్వతా షణ్ముఖ్.. మళ్లీ సిరి దగ్గరకు వెళ్లి రా గేమ్ ఆడదాం అని అడుగుతాడు.. అరిచింది నేనే కదా.. అందుకే వచ్చి అడుగుతున్నా.. ఇప్పుడు కూడా నీ ఎమోషన్స్ గురించే మాట్లాడుతున్నావ్.. నిన్ను అసలు ఏం అన్నాను’ అంటూ కవర్ చేసుకుంటాడు.
దోసెలు వేసుకొచ్చి.. సిరికి క్షమాపణ చెప్తాడు.. దీంతో సిరి నవ్వుతూ.. షణ్ముఖ్‌కి హగ్ ఇస్తుంది. మా మమ్మీ ఏమీ అనదు అనడంతో సిరిని సోఫాలో కూర్చోపెట్టుకొని హగ్ ఇస్తాడు. ఇక సీన్ రీ క్రియేషన్ టాస్కులో హమీదా ట్యాగ్ మెడలో వేసుకున్న సన్నీని చూడగానే శ్రీరామ్‌లో ప్రాణం లేచి వచ్చినట్లైంది. మిస్ యూ హమీదా అంటూ సన్నీని హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు.
ఇప్పటివరకు జరిగిన రీ క్రియేషన్ టాస్కులో మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్‌గా హౌస్మేట్స్ షణ్నును ఎంచుకున్నారు. దీంతో అతడు ఆడియన్స్‌ను ఓటేయమని అడిగే అర్హత పొందాడు. ‘ప్రేక్షకులే నా దేవుళ్లు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడున్న అందరికీ ఓటేయండి, నాకు కొంచెం ఎక్కువ ఓట్లేయండి’ అని కోరాడు.