మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ రేణుక అనే కీలక పాత్రలో నటిస్తున్నది. స్వాతిగా పాయల్ రాజ్‌పుత్ కనిపించనుంది. ఈ చిత్రంలో హీరో పాత్రను కార్టూన్‌గా విడుదల చేసిన చిత్రబృందం..తాజాగా నాయికల పాత్రలను కూడా రిలీజ్ చేసింది. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మూలకథ అందించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చుతున్నారు.